పురుషులతో సమానంగా భారత మహిళా క్రికెటర్లకు జీతాలు
మహిళ క్రికెటర్ల విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. క్రికెట్ లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా తెలిపారు. బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న భారత మహిళా క్రికెటర్లకు పే ఈక్విటీ పాలసీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పురుషులు, మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఒకే విధంగా ఉంటుంది. "బీసీసీఐ వివక్షను రూపుమాపడంలో మొదటి అడుగు అని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. మా కాంట్రాక్ట్ BCCI మహిళా క్రికెటర్లకు మేము పే ఈక్విటీ విధానాన్ని అమలు చేస్తున్నాము. పురుషులు, మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఉంటుంది" అని జై షా ట్వీట్ చేశారు. మహిళలు, పురుషులకు సమానమైన వేతనం ప్రకటించడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని పలువురు క్రికెటర్లు తెలిపారు. మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఇకపై.. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఆటగాళ్లకు రూ.15 లక్షలు, వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి రూ.6 లక్షలు, T20 మ్యాచ్‌కి రూ.3 లక్షలు బీసీసీఐ చెల్లించనుంది. పే ఈక్విటీ పాలసీ ద్వారా మహిళా క్రికెటర్లు భారీగా ఆదాయాన్ని ఆర్జించనున్నారు.