గెలిచిన భారత జట్టు.. కానీ
తొలి వన్డేలో భారత జట్టు విండీస్ ను మట్టి కురిపించింది. ఈ మ్యాచ్ లో విండీస్ ఏ మాత్రం పోటీని
తొలి వన్డేలో భారత జట్టు విండీస్ ను మట్టి కురిపించింది. ఈ మ్యాచ్ లో విండీస్ ఏ మాత్రం పోటీని ఇవ్వలేకపోయింది. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన తొలివన్డేలో విండీస్ జట్టుపై టీమిండియా అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెస్టిండీస్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ మ్యాచ్ లో విండీస్ కనీసం 30 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. తొలి వన్డేలో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో షెయ్ హోప్ ఒక్కడే 43 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 1, ముఖేశ్ కుమార్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. కెప్టెన్ షాయ్ హోప్ కాకుండా అలిక్ అథనేజ్ 22, ఓపెనర్ బ్రాండన్ కింగ్ 17, షిమ్రోన్ హెట్మెయర్ 11 పరుగులు చేశారు. మిగతా అంతా సింగిల్ డిజిట్ స్కోరుకు పెవిలియన్ చేరారు.