Mon Dec 23 2024 01:18:03 GMT+0000 (Coordinated Universal Time)
చేజేతులా మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా
మొదటి టీ20 మ్యాచ్ లో భారతజట్టు చేజేతులా ఓడిపోయింది
మొదటి టీ20 మ్యాచ్ లో భారతజట్టు చేజేతులా ఓడిపోయింది. ఒకానొక దశలో గెలుపు దిశగా భారత్ పయనిస్తూ ఉందని భావించాం. కానీ వరుసగా వికెట్లను కోల్పోయి.. మ్యాచ్ ను విండీస్ కు సమర్పించింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది. నాలుగు పరుగుల తేడాతో భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ను భారీ స్కోరు చేయనివ్వకుండా కట్టడి చేశారు. కెప్టెన్ రోవ్ మాన్ పావెల్ (32 బంతుల్లో 48 పరుగులు), నికోలాస్ పూరన్ (34 బంతుల్లో 41) రాణించినప్పటికీ.. విండీస్ స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. చివరి 5 ఓవర్లలో విండీస్ 42 పరుగులు సాధించింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. కైల్ మేయర్స్ (1), జాన్సన్ చార్లెస్ (3), షిమ్రోన్ హెట్మెయర్ (10) విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో చహల్ 2, అర్షదీప్ సింగ్ 2, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.
ఇక ఛేజింగ్ లో భారత ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. ఇషాన్ కిషన్ 6, గిల్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ 21, తిలక్ వర్మ 39, హార్దిక్ పాండ్యా 19 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నారు. ఇక గెలిపిస్తాడని అనుకున్న సంజూ శాంసన్ 12, అక్షర్ పటేల్ 13 పరుగులు చేసి అవుట్ అయిపోయారు. ఆఖర్లో అర్షదీప్ 12 పరుగులతో మెరిసినప్పటికీ ఆఖరి ఓవర్ లో రనౌట్ అవ్వడంతో భారత్ కు ఓటమి తప్పలేదు.
Next Story