Fri Nov 22 2024 17:15:34 GMT+0000 (Coordinated Universal Time)
INDvsWI: ఆశలు రేపారు.. మ్యాచ్ ఇచ్చేశారు
రెండో టీ20 మ్యాచ్ లో కూడా భారత్ కు ఓటమి ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన
రెండో టీ20 మ్యాచ్ లో కూడా భారత్ కు ఓటమి ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. నికోలస్ పూరన్(40 బంతుల్లో 67) దెబ్బకు భారత్ ఈ మ్యాచ్ లో ఓటమి దిశగా పయనించింది. అయితే ఆఖర్లో పూరన్ అవుట్ అవ్వడం.. ఆ తర్వాత హెట్మయర్, హోల్డర్, షెపర్డ్ అవుట్ అవ్వడంతో భారత్ కు కూడా విజయావకాశాలు మెరుగయ్యాయి. అయితే ఆఖర్లో అకిల్ హుస్సేన్(16), అల్జారీ జోసెఫ్(10) లు మ్యాచ్ ను ముగించారు. 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది విండీస్.
గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో సాగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక మార్పు చేసింది. కుల్దీప్ యాదవ్ చేతికి గాయం కావడంతో, అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తుది జట్టులో స్థానం సంపాదించాడు. అయితే బ్యాటింగ్ లో భారత టాపార్డర్ మెరవలేకపోయింది. రెండో టీ20 మ్యాచ్ లోనూ తిలక్ వర్మ సత్తా చాటాడు. అర్థసెంచరీతో మెరిశాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 27 పరుగులు చేయగా, శుభ్ మాన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (1), సంజు శాంసన్ (7), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (24), అక్షర్ పటేల్ (14) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల్ హోసీన్ 2, అల్జారీ జోసెఫ్ 2, రొమారియో షెపర్డ్ 2 వికెట్లు తీశారు.
Next Story