Fri Nov 22 2024 16:55:15 GMT+0000 (Coordinated Universal Time)
సూర్య కుమార్ విధ్వంసం.. గెలిచి నిలిచిన భారత్
ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. అయితే కేవలం
గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో భారత్ విజయాన్ని సాధించింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో భారతజట్టు ఓడిపోగా సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్ లో భారత్ ఎట్టకేలకు గెలవాల్సి ఉండగా.. సూర్య కుమార్ విధ్వంసం, తెలుగు తేజం తిలక్ వర్మ బ్యాటింగ్ లో రాణించడంతో భారత్ విజయాన్ని అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. అయితే కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్.. అద్భుతంగా ఆడాడు. 44 బంతుల్లో 83 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సూర్య తన ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేశాడు. 23 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ చేయడం విశేషం. మరో ఓపెనర్ గిల్ ఈ మ్యాచ్ లో కూడా విఫలమయ్యాడు. 11 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో కూడా సత్తా చాటాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి.. భారత్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. 49 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 14 పరుగులతో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.
మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత్కు 160 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 42 పరుగులు చేసి రాణించగా, చివరలో విండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ 19 బంతుల్లో 40 పరుగులు చేసి చెప్పుకోదగ్గ స్కోరును అందించాడు. విండీస్ జట్టులో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 42, కైల్ మేయర్స్ 25 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ను టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఒకే ఓవర్లో జాన్సన్ చార్లెస్ (12), పూరన్ లను అవుట్ చేసి విండీస్ భారీ స్కోరు చేయనివ్వకుండా అడ్డుకున్నాడు. పూరన్ 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ మూడు వికెట్లు తీయగా.. ముకేష్ కుమార్, అక్షర్ పటేల్లు తలా ఒక వికెట్ తీశారు.
Next Story