Fri Nov 22 2024 17:09:11 GMT+0000 (Coordinated Universal Time)
INDvsWI: విండీస్ ను వాయించేసిన టీమిండియా
2-0 తో సిరీస్ లో వెనుకంజలో ఉన్న సమయంలో భారత జట్టు ఊహించని విధంగా పుంజుకుంది
2-0 తో సిరీస్ లో వెనుకంజలో ఉన్న సమయంలో భారత జట్టు ఊహించని విధంగా పుంజుకుంది. 4 మ్యాచ్ లు ముగిసే సమయానికి భారత్ 2-2 తో సిరీస్ ను సమం చేసింది. ఇక ఆఖరి టీ20 మ్యాచ్ లో విజయం సాధిస్తే భారత్ కే సిరీస్ దక్కనుంది. విండీస్ టూర్ లో పెద్దగా ఆకట్టుకోకపోయిన ఓపెనర్ శుభమాన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతడితో కలిసి యశస్వి జైస్వాల్ కూడా దుమ్ము దులిపాడు. ఈ మ్యాచ్ లో ఏ దశలోనూ విండీస్ కు భారత బ్యాటర్లు అవకాశం ఇవ్వలేదు. 9 వికెట్ల తేడాతో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొదటి వికెట్ కు యశస్వి జైస్వాల్, గిల్ కలిసి ఏకంగా 165 పరుగులు జోడించారు. గిల్ 47 బంతుల్లో 77 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. జైస్వాల్ 51 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ 5 బంతుల్లో 7 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హిట్మెయర్ 39 బంతుల్లో 61 పరుగులు చేశాడు. షై హోప్ 29 బంతుల్లో 45 రన్స్ స్కోర్ చేశాడు. షిమ్రాన్ హెట్‌మైర్(61; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), షై హోప్(45; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో రాణించారు. కైల్ మేయర్స్(17), బ్రెండన్ కింగ్(18) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు.
Next Story