Mon Dec 23 2024 15:32:36 GMT+0000 (Coordinated Universal Time)
రెండో టీ 20లో వెస్టిండీస్ దే విజయం
రెండో టీ 20 వెస్టిండీస్ విజయం సాధించింది. భారత్ - వెస్టిండీస్ ల మధ్య జరిగిన రెండో టీ 20లో విండీస్ పై చేయి సాధించింది
రెండో టీ 20 వెస్టిండీస్ విజయం సాధించింది. భారత్ - వెస్టిండీస్ ల మధ్య జరిగిన రెండో టీ 20లో విండీస్ పై చేయి సాధించింది. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీం ఇండియా 138 పరుగులు చేసింది. టీం ఇండియా బ్యాటర్లలో పాండ్యా 31 పరుగులు, జడేజా 27, రిషబ్ పంత్ 24 అత్యధిక పరుగులు చేశారు. మిగిలిన వారంతా అతి తక్కువ స్కోరుకే అవుటయ్యారు. 20 ఓవర్లలో 138 పరుగులు చేసిన టీం ఇండియాను మోకాయ్ ఆరు వికెట్లు తీసి దెబ్బతీశాడు. దీంతో టీం ఇండియా తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయింది.
చివరి వరకూ...
ీఅనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. బ్రాండగన్ కింగ్ 68 పరుగులు చేశాడు. డెవాన్ ధామస్ 31 పరుగులు చేశాడు. అయితే చివరి నిమిషం వరకూ ఉత్కంఠగానే ఆట కొనసాగింది. బౌలర్లందరూ తలా ఒక వికెట్ తీసినా లక్ష్యం చిన్నది కావడం, బ్రాండన్ కింగ్ వీర బాదుడుతో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో టీ 20 సిరీస్ 1 -1 తో సమం అయింది. మూడో టీ 20లో సిరిస్ ఎవరిదన్నది తేలనుంది.
Next Story