Fri Nov 15 2024 07:05:44 GMT+0000 (Coordinated Universal Time)
డేట్ కు వెళ్తానన్న పాక్ నటి.. ఇప్పుడేమంటోందో తెలుసా?
భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమిపాలవ్వడంపై షిన్వారీ స్పందిస్తూ
ప్రస్తుత ప్రపంచ కప్ లో భారతజట్టు జైత్ర యాత్ర కొనసాగుతూ ఉంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో జరిగిన పోరులో పాకిస్థాన్ క్రికెట్ జట్టును భారత్ చిత్తు చేసింది. గురువారం నాడు బంగ్లాదేశ్ ను కూడా బోల్తా కొట్టించింది భారత్.
పాకిస్థాన్ ఓటమికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ నటి ఆశించింది. ప్రపంచ కప్‌లో భారత్‌ను ఓడించగలిగితే బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేటింగ్‌కు వెళ్తానని సెహర్ షిన్వారీ అనే పాక్ నటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. "ఇన్షా అల్లా నా బంగాలీ బందు తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున ప్రతీకారం తీర్చుకుంటారు. బంగ్లాదేశ్ జట్టు భారత్‌ను ఓడించగలిగితే నేను ఢాకా వెళ్లి బంగాలీ అబ్బాయితో డిన్నర్ డేట్ చేస్తాను" అని సెహర్ షిన్వారీ పోస్టు పెట్టింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక బంగ్లాదేశ్ కూడా భారత్ చేతిలో ఓడిపోవడంతో నెక్స్ట్ న్యూజిలాండ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తావా అని పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే షిన్వావీ బంగ్లాదేశ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.
భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమిపాలవ్వడంపై షిన్వారీ స్పందిస్తూ.. ‘‘బంగ్లా ఆటగాళ్లు బాగా ఆడారు. కనీసం మీరు భారత్‌తో వారి సొంతగడ్డపై బాగా పోరాడారు’’ అని తెలిపింది. షిన్వారీ నెటిజన్ల అటెన్షన్ కోసం ఇలాంటి పోస్టులు పెడుతూ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కూడా ఆమె పలు వివాదాస్పద పోస్టులు చేసింది.
Next Story