Sat Dec 21 2024 05:07:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడే ఆస్ట్రేలియాతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్.. లైవ్ ఎక్కడ చూడొచ్చు
టీ20 ప్రపంచకప్లో భాగంగా బ్రిస్బేన్లో జరిగే తొలి వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. సోమవారం జరిగే ఈ మ్యాచ్ భారత్కు తొలి అధికారిక వార్మప్ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత భారత్ న్యూజిలాండ్తో ఆడుతుంది. భారత్ కు ప్రధాన సమస్యగా మారిన డెత్ ఓవర్స్ బౌలింగ్ ఈ మ్యాచ్ లో ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లలో భారత్ స్వల్ప పురోగతిని సాధించింది, వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు ఐదు ఓవర్లలో 41 పరుగులు చేయగలిగింది. హర్షల్ పటేల్ బాగా బౌలింగ్ చేశాడు. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగే వార్మప్ మ్యాచ్కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తిరిగి రానున్నారు. ఇక సొంత గడ్డపై సత్తా చాటడానికి ఆస్ట్రేలియా కూడా ఎంతగానో ఉవ్విళ్లూరుతోంది.
టీ20 ప్రపంచకప్కు ముందు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 1వ వార్మప్ మ్యాచ్ సోమవారం, అక్టోబర్ 17న జరగనుంది. ఈ వార్మప్ మ్యాచ్ బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రసారం చేయబడుతుంది. T20 ప్రపంచ కప్కు ముందు భారత్ vs ఆస్ట్రేలియా 1వ వార్మప్ మ్యాచ్ డిస్నీ+ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
Next Story