Sun Dec 22 2024 21:39:03 GMT+0000 (Coordinated Universal Time)
Who Is Manu Bhaker: ఎవరీ మనూ భాకర్
షూటింగ్ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది
హర్యానా దేశానికి ఎంతో అత్యుత్తమ అథ్లెట్లను అందించింది. బాక్సర్లు, రెజ్లర్లకు కేరాఫ్ గా నిలిచింది. అయితే మను భాకర్ మాత్రం చిన్నప్పుడు 'తంగ్ టా' అనే మార్షల్ ఆర్ట్స్‌లో రాణించి జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. అయితే భాకర్ చివరికి షూటింగ్ ని ఎంచుకుంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో చారిత్రాత్మకమైన కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 221.7 పాయింట్లతో మను భాకర్ మూడవ స్థానంలో నిలిచింది. దక్షిణకొరియాకు చెందిన వైజే ఓహ్ 243.2 పాయింట్లతో స్వర్ణం, వైజే కిమ్241.3 పాయింట్లతో రజతం గెలుచుకుంది. ఒలింపిక్స్‌లో షూటింగ్ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది.
2016 రియో ఒలింపిక్స్ ముగిసే సమయానికి మను వయసు 14 సంవత్సరాలు. ఆ వయస్సులో ఆమె షూటింగ్లో తన సత్తా చాటాలని ఫిక్స్ అయింది. తాను షూటింగ్ కెరీర్ మొదలుపెట్టాలని అనుకుంటున్నానని చెప్పి.. తనకు స్పోర్ట్ షూటింగ్ పిస్టల్ కావాలని తండ్రిని కోరింది. ఆమె తండ్రి, పెద్దగా ఆలోచించకుండా ఆమె చేతుల్లో తుపాకీని పెట్టాడు.
మను టీనేజ్ లో ఉన్నప్పటి నుండి జాతీయ, ప్రపంచ ఈవెంట్లలో భారత్ కు పతకాలను తీసుకుని రావడం మొదలుపెట్టింది. 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లలో, ఒలింపియన్, మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధూను ఓడించి మను భాకర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె రికార్డు స్కోరు 242.3 సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె రికార్డు సాధించింది. ఆమె 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో రజత పతకాన్ని కూడా గెలుచుకుంది. గ్వాడలజారాలో జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచ కప్‌లో తన అరంగేట్రం చేసి, జూనియర్ స్థాయిలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా మను ప్రపంచ స్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమయ్యానని ప్రకటించింది.
కేవలం 16 సంవత్సరాల వయస్సులో, మను ISSF ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించి.. అతి పిన్న వయసులో ఈ రికార్డు సొంతం చేసుకుంది. మను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకాలు సాధిస్తూనే ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో, మను భాకర్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని సాధించింది.
మను భాకర్ 2019 మ్యూనిచ్ ISSF ప్రపంచ కప్‌లో నాల్గవ స్థానం సాధించగా.. టోక్యో ఒలింపిక్స్‌లోకి అవకాశం దక్కింది. ఆమె 2021 న్యూఢిల్లీ ISSF ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో బంగారు, రజత పతకాన్ని సాధించింది. టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో షూటింగ్లో తప్పకుండా మను పతకం సాధిస్తుందని ఆశించారు. మను భాకర్ క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే కీలక సమయంలో పిస్టల్ పనిచేయకపోవడంతో ఆమెకు ఎలాంటి పతకం దక్కలేదు. అయితే ఎట్టకేలకు పారిస్ లో పతాకాన్ని సొంతం చేసుకుని ఒలింపిక్స్ లో మను ఖాతా తెరిచింది.
Next Story