Mon Dec 23 2024 05:58:20 GMT+0000 (Coordinated Universal Time)
Rohit Sharma : హేళన చేసినోళ్లు నోళ్లు మూయించాలి భయ్యా... లేకుంటే కుదరదంతే
ఎవరు అవునన్నా కాదన్నా రోహిత్ శర్మ మంచి ఓపెనర్. అంతకు మించి నిఖార్సయిన కెప్టెన్.
ఎవరు అవునన్నా కాదన్నా రోహిత్ శర్మ మంచి ఓపెనర్. అంతకు మించి నిఖార్సయిన కెప్టెన్. వరల్డ్ కప్ తృటిలో మిస్ అయి ఉండవచ్చు కానీ.. హిట్ మ్యాన్ ట్రాక్ రికార్డు చూసిన వారెవరూ రోహిత్ ను తేలిగ్గా తీసుకోరు. కానీ ముంబయి ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ కనపడుతున్నాయి. రోహిత్ కు అండగా అనేక మంది నిలబడుతున్నారు. రోహిత్ కు వచ్చే నష్టమేమీ లేదని, కెప్టెన్సీ నుంచి తొలగించి ముంబయి ఇండియన్స్ యాజమాన్యం తన గొయ్యి తానే తవ్వుకున్నట్లయిందన్న కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అనేక విజయాలను...
రోహిత్ శర్మ ఓపెనర్ గా దిగి స్కోరు బోర్డును వేగం పెంచడంలో దిట్ట. వయసు పెరుగుతున్నప్పటికీ షాట్లు కొట్టే తీరు చూడ ముచ్చటేస్తుంది. కొత్తగా వచ్చిన వారు కూడా రోహిత్ శర్మతో పోటీ పడలేకపోతున్నారు. సిక్సర్ అలవోకగా కొట్టగలడు. ఫోర్స్ అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్ గా కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో రోహిత్ శర్మ జట్టుకు అనేక విజయాలు అందించడంతోనే అది నిజమని చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల వికెట్లు పడకపోతే.. బౌలర్లను మార్చి మార్చి చివరకు పాతుకుపోయిన ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాన్ని కూడా విడదీయగలడు. అలాంటి రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం ఎంత వరకూ సబబన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఢిల్లీ రెడీ...
అయితే రోహిత్ శర్మ సత్తా తెలిసిన మిగిలిన ఫ్రాంచైజీలు ఊరికే ఉండవు. సీనియర్ ప్లేయర్ గా అనుభవమున్న రోహిత్ శర్మకు ఆహ్వానం పలకడానికి అందరూ ముందుంటారు. ఇప్పుడు ఐపీఎల్ 2024 లోనూ రోహిత్ శర్మను తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆహ్వానం పంపినట్లు తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతగాడిని ఇంపాక్ట్ ప్లేయర్ గా వినియోగించుకునే అవకాశముంది. అంతకు మించి అతనికి కెప్టెన్సీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సమయంలో రోహిత్ శర్మ కూడా ముంబయి ఇండియన్స్ ను వదిలి ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు చేపట్టి జట్టును విజయపథాన నడిపించి తగిన గుణపాఠం చెప్పాలని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Next Story