Sun Dec 22 2024 02:07:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆసియా కప్ కోసం భారత జట్టు అక్కడికి వెళ్లదు: బీసీసీఐ
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బీసీసీఐ పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడడం మానేసింది. ఇక పాక్ లో టోర్నమెంట్లు పెడితే కూడా అక్కడకు వెళ్లే ఉద్దేశాలు తమకు లేవని గతంలో కూడా తెలిపింది. తాజాగా కూడా తమ నిర్ణయంలో మార్పు లేదని బీసీసీఐ తెలిపింది. 2023 ఆసియా కప్ హోస్టింగ్ హక్కులు పాకిస్తాన్‌కు ఇచ్చారు, అయితే ఆ టోర్నమెంట్ లో పాల్గొనడం కోసం భారత జట్టు పాక్ కు వెళ్లదని BCCI మంగళవారం స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు అది తటస్థ వేదికలో నిర్వహించే అవకాశం ఉంది. ఆసియా కప్‌ను ఇప్పుడు మరెక్కడైనా నిర్వహించాల్సి ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు.
పాకిస్తాన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా పాకిస్థాన్ లో పర్యటించడం చాలా సమస్యాత్మకం.. అక్కడకు వెళ్లడానికి ముందు BCCI కు ప్రభుత్వ అనుమతి అవసరం. షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. జై షా ప్రకటన పాకిస్థాన్‌లో టోర్నమెంట్ ను నిర్వహించే అవకాశాలు చాలా తక్కువ అయ్యాయి. "ఆసియా కప్ 2023 తటస్థ వేదికలో జరుగుతుంది. ఏసీసీ అధ్యక్షుడిగా ఈ విషయం చెబుతున్నాను. మేము [భారతదేశం] అక్కడికి [పాకిస్థాన్‌కు] వెళ్లలేము, వారు ఇక్కడికి రాలేరు. గతంలో కూడా ఆసియా కప్ తటస్థ వేదికలో జరిగింది' అని ముంబైలో జరిగిన 91వ బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం తర్వాత షా ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో 2005-06లో ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్ చివరిసారిగా పాకిస్థాన్‌కు వెళ్లింది. 2008లో ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత్ పాకిస్థాన్‌కు వెళ్లింది. 2022 ఆసియా కప్ గత నెలలో యుఎఇలో జరిగింది, ఆతిథ్య శ్రీలంక స్వదేశంలో ఆర్థిక సంక్షోభం మధ్య ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో తమకు వీలవ్వదని తెలిపింది. భారతదేశం, పాకిస్థాన్ ఈ టోర్నమెంట్లో రెండుసార్లు ఆడాయి. ఇక T20 ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబర్ 23 న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో మరోసారి ఢీకొనబోతున్నాయి.
Next Story