Mon Dec 23 2024 06:02:40 GMT+0000 (Coordinated Universal Time)
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ
మహిళల ఐపీఎల్ లో ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకుపోతోంది
మహిళల ఐపీఎల్ లో ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచిన ఆర్సీబీ మంచి నెట్ రన్ రేట్ తో టాప్ పొజిషన్ లో నిలిచింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి గుజరాత్ ను చిత్తు చిత్తు చేసింది.
ఆర్సీబీ తరపున బౌలింగ్ లో రేణుకా సింగ్ 2/14 , సోఫీ మోలినెక్స్ 3/25, బ్యాటింగ్ లో స్మృతి మంధాన 27 బంతుల్లో 43 పరుగులతో రాణించడంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండవ విజయాన్ని సొంతం చేసుకుంది. 108 పరుగుల టార్గెట్ ను RCB 12.3 ఓవర్లలో చేధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మంధానతో పాటు, సబ్బినేని మేఘన 28 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేయగా, ఎల్లీస్ పెర్రీ 14 బంతుల్లో అజేయంగా 23 పరుగులు చేసి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఇక సొంత గడ్డపై బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. గుజరాత్ బ్యాటర్లలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. హేమలత 25 బంతుల్లో 31 పరుగులు చేయడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది.
Next Story