Mon Dec 23 2024 05:10:07 GMT+0000 (Coordinated Universal Time)
INDvsZIM: మూడో టీ20 మనదే!!
మొదటి టీ20 మ్యాచ్ లో జింబాబ్వే షాక్ ఇవ్వగా
మొదటి టీ20 మ్యాచ్ లో జింబాబ్వే షాక్ ఇవ్వగా.. ఆ తర్వాతి రెండు మ్యాచ్ లలో విజయాలు అందుకుని భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకోడానికి ఓ అడుగు దూరంలో ఉంది. హరారే వేదికగా సాగిన మూడో టీ20 మ్యాచ్ లో భారతజట్టు 23 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. జింబాబ్వే లక్ష్య ఛేదనలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితమైంది.
ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) యశస్వీ జైస్వాల్ (27 బంతుల్లో 36, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. గత మ్యాచ్లో సెంచరీ బాదిన అభిషేక్ శర్మ (10) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికందర్ రజా (2/24), బ్లెస్సింగ్ ముజర్బని (2/25) ఆకట్టుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ జింబాబ్వే ఆ దిశగా ముందుకు సాగలేదు. వరుస విరామంలో భారత బౌలర్లు వికెట్లు తీయగా.. ఆ తర్వాత కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువవ్వడంతో జింబాబ్వే బ్యాటర్లు చేతులెత్తేశారు. మేయర్స్ 65 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మదాండే 37 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సుందర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Next Story