Fri Nov 22 2024 18:09:03 GMT+0000 (Coordinated Universal Time)
Sri RamaNavami 2023 : ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరాముడి కల్యాణం పౌర్ణమి రోజున వెన్నెలలో నిర్వహించడానికి కాణమేంటో తెలుసా ?
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ..
యావత్ దేశమంతా.. శ్రీ సీతారాముల కల్యాణాన్ని శ్రీరామనవమి రోజున జరుపుకుంటే.. ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో మాత్రం చైత్ర పౌర్ణమి నాడు నిర్వహిస్తారు. దానివెనుక ఒక పురాణ కథ ఉంది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఆంధ్రా భద్రాచలంగా పేర్కొంటారు. కడప నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఏకశిలలో దర్శనమివ్వడం ఈ ఆలయ విశేషం. మహర్షులకు, తపోధనులకు, యజ్ఞ యాగాలకు త్రేతాయుగంలో ప్రసిధ్ది చెందింది.
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని చెబుతుంటారు.
హనుమంతుడు లేని సీతారామ లక్ష్మణులు ఉన్న ఏకైక ఆలయం దేశంలో ఇది మాత్రమే. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి సీతారాముల గర్భగుడిలో కాకుండా ప్రత్యేకంగా సంజీవరాయుడుగా కొలువై ఉన్నాడు. ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది.
పున్నమిరోజున కల్యాణం చేయడానికి కారణం ?
ఒంటిమిట్టలో 11 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కానీ.. శ్రీరామ నవమి రోజున ఇక్కడ కల్యాణం చేయరు. అందుకు కారణం లేకపోలేదు. ఇక్కడ పౌర్ణమి రాత్రి కల్యాణం చేయడానికి వెనుక ఓ పురాణ కథ ఉంది. విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో..నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది.
Next Story