Mon Dec 23 2024 06:13:19 GMT+0000 (Coordinated Universal Time)
Congress : పథ్నాలుగు రోజులు ఇద్దరూ ఇక్కడే.. ప్రచారం ముమ్మరం
తెలంగాణలో గెలుపు అవకాశాలు ఉండటంతో పార్టీ హైకమాండ్ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
తెలంగాణలో గెలుపు అవకాశాలు ఉండటంతో పార్టీ హైకమాండ్ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అగ్రనేతలు వరస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ అనేక సార్లు వచ్చి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోనియా గాంధీ వచ్చి ఆరు గ్యారంటీలను విడుదల చేశారు. ప్రియాంక గాంధీ సయితం రెండు సార్లు వచ్చి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏఐసీసీ ఛైర్మన్ మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి ఒక విడత ప్రచారంలో పాల్గొన్నారు.
పర్యటన ఖరారు....
కాగా ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటనలు కూడా ఖరారయ్యాయి. ఇద్దరూ దాదాపు పథ్నాలుగు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోపు కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా ఖరారు అవుతుంది కాబట్టి ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆరు గ్యారంటీలను మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు.
Next Story