KCR: ప్రాంతీయ పార్టీలదే అధికారం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరింత
Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరింత తగ్గర పడుతుండటంతో పార్టీల నేతల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బడా నేతలు సైతం తెలంగాణలో వాలిపోతున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతోంది. ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ తొలిసారి జాతీయ రాజకీయాలను ప్రస్తావించారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని అన్నారు.
నిన్న నిజామాబాద్ అర్బన్‌లో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులు ప్రాంతీయ పార్టీలవే అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని, అందరు ఎంపీలను కూడా గెలిపించుకుని కేంద్రంలో తడాఖా చూపిద్దామంటూ కేసీఆర్ వివరించారు.
బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ ఆశీర్వాద సభల్లో ప్రసంగించిన కేసీఆర్.. అభివృద్ధితో పాటు బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరించారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం కేంద్రం చేసిందేమి లేదని ఆరోపించారు. అలాంటిది బీజేపీ ఓటు వేయ్యడం దేనికని ప్రశ్నించారు.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌పై సెటైర్ వేశారు కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థికి పోలిక ఉందా అంటూ ప్రశ్నించారు. దిష్టిబొమ్మను తీసుకొచ్చి పద్మ ఎదురుగా పెడితే.. మనం ఓడిపోవాలా అని అన్నారు.