Assembly Elections: రూ.709 కోట్ల సొమ్ము సీజ్: ఎన్నికల ప్రధానాధికారి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజుల సమయమే ఉంది. ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి పెద్ద ఎత్తున నగదు, నగలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజుల సమయమే ఉంది. ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి పెద్ద ఎత్తున నగదు, నగలు, మద్యం పట్టుబడుతున్నాయి. పోలీసులు కోడ్ వచ్చిన నాటి నుంచి అడుగడుగునా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున నగదు, నగలు, మద్యం పట్టుబడుతూనే ఉన్నాయి. వీటికి తగిన పత్రాలు చూపించిన వారివి మాత్రమే వదిలేస్తున్నారు పోలీసులు. ఎలాంటి పత్రాలు లేనివి సీజ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ఉల్లంఘన కింద భారీ ఎత్తున నగదు సీజ్ చేస్తున్నారు పోలీసులు. ఆదివారం మధ్యాహ్నం వరకు రూ. 709 కోట్ల సొమ్ము సీజ్ చేయగా, అందులో 290 కోట్ల రూపాయలు నగదు ఉన్నట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.ఇదిలా ఉండగా, 2290 మొత్తం అభ్యర్థుల్లో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 49 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోసం 45 వేల మంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసులు విధుల్లో ఉన్నార.
375 కేంద్ర బలగాల కంపెనీలు వచ్చాయి. 24 వేల మంది హోం గార్డులు ఇతర రాష్ట్రాల నుంచి రానున్నారు. 72, 48 గంటల ముందు కఠినమైన నిబంధనలు ఉంటాయి. 48 గంటల ముందు నుంచే 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 48 గంటల ముందే స్థానికేతరులు బయటకు వెళ్లిపోవాలి. సైలెంట్ పీరియడ్ లో టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు అనుమతి లేదన్నారు.
మొత్తం పోస్టల్ బ్యాలెట్ కోసం 1 లక్ష 65వేలు ఆమోదించగా.. ఇప్పటి వరకు 95వేలు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. 54 లక్షల 13 వేల ఎపిక్ కార్డుల ప్రింటింగ్ పూర్తయిందని, పంపిణి జరుగుతోందని ఆయన తెలిపారు. దివ్యాంగులు, వృద్దులు ఓటే వేసేందుక అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్, ఒక సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఇప్పటికే 80వేల వీల్ చైర్లను అయా జిల్లాలకు పంపామని తెలిపారు.