Fri Dec 20 2024 12:39:08 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : మ్యానిఫేస్టో విడుదల చేసిన అమిత్ షా.. ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు
బీజేపీ తెలంగాణ ఎన్నికల మ్యానిఫేస్టోను ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మ్యానిఫేస్టోను విడుదల చేశారు
బీజేపీ తెలంగాణ ఎన్నికల మ్యానిఫేస్టోను ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మ్యానిఫేస్టోను విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట ఈ మ్యానిఫేస్టోను విడుదల చేసింది. పది అంశాల కార్యాచరణను ప్రకటించింది. బీసీని తొలి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటన చేశారు. ప్రజలందరీకి సుపరిపాలన - సమర్థవంతమైన పాలన అందిస్తామని తెలిపింది. వెనుకబడిన వర్గాలకు రైతేరాజు - అన్నదాతలంకు అందలం కల్పిస్తామని పేర్కంది. నారీశక్తి - మహిళల నేతృత్వంలో అభివృద్ధి. మహిళలకు పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది. మహిళల కోసం మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఆరునెలల్లో ఉద్యోగాల భర్తీ...
విత్తనాల కొనుగోలుకు రూ.2500లు ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తామని పేర్కొంది. కూడు, గుడ్డ, ఆహార, నివాస భద్రతను కల్పిస్తామని తెలిపింది.యువశక్తి ఉపాధి పథకం కింద గ్రూప్ వన్, గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపింది. వైద్యశ్రీ పథకం అందరికీ నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈడబ్ల్యూఎస్ కోటాతో పాటు అన్ని ఉద్యోగాలు ఆరునెలల్లో భర్తీ చేస్తామని తెలిపింది. అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి పది లక్షల వరకూ ఉచిత వైద్యం కల్పిస్తామని తెలిపింది.
అందరికీ పక్కా ఇళ్లు...
నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో బీజేపీ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది. వెనుకబడిన వర్గాలకు సాధికారికత కల్పిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పేదలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపింది. విద్యాశ్రీ కింద నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది. జిల్లా స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించి వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చింది. ఉజ్వల లబ్దిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపింది. అధికారికంగా సెప్టంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని పేర్కొంది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని...
సంపూర్ణ వికాసం కింద పరిశ్రమలను స్థాపించి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపింది సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రీఎంబర్స్మెంట్ ఇస్తామని తెలిపింది. జాతీయ స్థాయి పండగగా సమ్మక్క - సారక్కను గుర్తిస్తామని అమిత్ షా చెప్పారు. నిజాం షుగర్స్ ఫ్యాకర్టీని తిరిగి తెరిపిస్తామని తెలిపింది. అయోధ్య, కాశీలకు తెలంగాణ వృద్ధులను ఉచితంగా తీసుకెళతామని హామీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది.
Next Story