Fri Dec 20 2024 08:40:55 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేలు గెలిపిప్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది : కేసీఆర్
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కోరుట్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ప్రజస్వామ్య పరిణితి కాంక్షిస్తూ ముందుకు పోవాలని అన్నారు. ఓటును తమాషాగా తీసుకుంటే జీవితమే తలకిందులవుతుందని అన్నారు. ఎమ్మెల్యేలను ఎన్నుకునేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఆ ఎమ్మెల్యే వెనక ఏ పార్టీ ఉందో చూసి మరీ ఓటు వేయాలని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అనుభవించిన కష్టాలన్నీ ఒక్కొక్కటీ తొలగిపోతున్నాయని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పింఛన్లను రెండు వందల నుంచి రెండు వేల రూపాయలకు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు.
బీడీ కార్మికుల కష్టాలు...
ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ తెలిపారు. బీడీ కార్మికుల కష్టాలను తొలగించడానికి బడ్జెట్ ను మరింతగా పెంచుతామని తెలిపారు. ఎవరో వచ్చి ఏదో చెబుతుంటారని, వాటిని నమ్ముతూ ఆగమాగం కావద్దని అన్నారు. బీడీ కార్మికులకు కూడా రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకూ పింఛను ఐదేళ్లలో పోతుందని తెలిపారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని ఆయన అన్నారు. రైతులు ఈరోజు సుఖంగా ఉన్నారన్నారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తుండటంతో రైతులకు ఇబ్బందే లేకుండా పోయిందన్నారు. నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు.
వ్యవసాయ స్థిరీకరణ కోసమే...
వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఎవరికి దరఖాస్తు చేయకుండానే బ్యాంకుల్లో డబ్బులు వేస్తున్నామని తెలిపారు. రెండు సార్లు రైతుల రుణమాఫీ చేశానని, ఈసారి లక్ష రూపాయల రుణమాఫీ చేద్దామనుకునేలోగా ఎన్నికలు వచ్చి పడ్డాయని ఆయన తెలిపారు. ధరణిని తొలగిస్తే రైతు బంధు డబ్బులు ఎలా వస్తాయి అని ఆయన ప్రశ్నించారు. ధరణిని తీసీస్తే దళారుల రాజ్యం మళ్లీ వస్తుందని అన్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి పది అయితే వంద వరకూ హామీలను అమలు చేశామని ఆయన తెలిపారు.
Next Story