Fri Dec 20 2024 05:33:04 GMT+0000 (Coordinated Universal Time)
KCR : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే.. చెప్పేసిన కేసీఆర్
కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో వచ్చేది 20 సీట్లు మాత్రమేనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. మధిర సభలో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో వచ్చేది 20 సీట్లు మాత్రమేనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. మధిర సభలో ఆయన ప్రసంగించారు. అభ్యర్థుల వెనక పార్టీల చరిత్ర కూడా ఏదో చూడాలని కేసీఆర్ కోరారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా కాలయాపన చేశారన్నారు. దీంతో తాను ఆమరణ దీక్షకు దిగానని తెలిపారు. ఇది అందరి ముందు జరిగిన చరిత్ర అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏముంది? ఈ పదేళ్లలో ఏం జరిగిందన్నది బేరీజు వేసుకోవాలన్నారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. నీళ్లు, కరెంట్ కోసం ఎంత ఇబ్బంది పడ్డామో తాను చెప్పనక్కరలేదన్నారు.
గత పదేళ్లలో...
గత పదేళ్లలో ఎక్కడా కరెంట్ కట్ లేదు. 24 గంటలు నీళ్లు వస్తున్నాయన్నారు. పొలాలన్నీ పచ్చగా మారాయని తెలిపారు. అతి తక్కువ కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ తలసరి ఆదాయం 2014 లో పద్దెనిమిదిలో ఉంటే.. ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ అని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను తలదన్ని వరిని పండిస్తున్నామని తెలిపారు. ఏపీలో ఎట్లుంది? తెలంగాణలో వరి పంట ఎట్లుందో చూసుకోవాలన్నారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణను తయారు చేశామన్నారు.
అభివృద్థి పథకాలు...
ప్రతి ఇంటికి శుద్ధిగల మంచినీటిని అందిస్తున్నామని, నల్లా రూపాయికే అందించామని కేసీఆర్ చెప్పారు. దళితుల్లో పేదరికం పోవాలనే దళిత బంధు పథకాన్ని తెచ్చామని తెలిపారు. మద్యం, ఫెర్టిలైజర్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. పట్టి లేని భట్టి విక్రమార్కకు ఓటేస్తే మనకు ఒరిగేదేంటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లో డజను మంది ముఖ్యమంత్రులున్నారని, కాంగ్రెస్ కు ఇరవై లోపే సీట్లు వస్తాయని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదని అన్నారు. దానికి ఓటేసి మోసపోవద్దని అన్నారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే దళితబంధు మధిరలోని అన్ని మండలాలకు ఇస్తామని తెలిపారు. కమలరాజ్ ను గెలిపిస్తే ఇంకా మధిర అభివృద్ధి జరుగుతుందన్నారు.
Next Story