Fri Nov 15 2024 04:48:25 GMT+0000 (Coordinated Universal Time)
KCR : బయటకు కనపడటం లేదు కానీ.. లోలోపల మాత్రం టెన్షన్ ఉన్నట్లుంది
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొంత డైలమాలో పడ్డట్టే కనిపిస్తుంది. గత రెండు ఎన్నికల కంటే భిన్నంగా ఆయన కదలికలు కనిపిస్తున్నాయి
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొంత డైలమాలో పడ్డట్టే కనిపిస్తుంది. గత రెండు ఎన్నికల కంటే భిన్నంగా ఆయన కదలికలు కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికలను ఈసారి అంత సీరియస్ గా కేసీఆర్ తీసుకోలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన సెంటిమెంట్ తో తన గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన నేతగా తనను ప్రజలు ఆదరిస్తారని నాడు గట్టిగా నమ్మారు. అయితే ఆశించిన సీట్లు రాలేదు. అప్పుడే రాష్ట్రం విడిపోవడంతో టీడీపీ, వైసీపీ ఓట్లు కూడా ఉండటం తో కొన్ని సీట్లు తగ్గాయి. ఓట్లు చీలిపోవడంతో నాడు తనకు నష్టం జరిగిందని కేసీఆర్ అంచనా వేసుకున్నారు. అనుకున్నట్లే నాడు అంచనా కు మించి సీట్లు దక్కలేదు.
రెండుసార్లు...
దీంతో ఆయన రెండోసారి కొంత అప్రమత్తమయ్యారు. లోక్సభ ఎన్నికలతో పాటు వెళితే జాతీయ పార్టీల ప్రభావం ఉంటుందని భావించిన కేసీఆర్ అందుకు విరుగుడు కనిపెట్టారు. ఒక ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి విజయం సాధించారు. గత ఎన్నికలకంటే అధిక స్థానాలను సాధించుకున్నారు. నాడు కూడా నేడు పడుతున్న టెన్షన్ పడలేదు. ఇన్ని హామీలు ఇవ్వలేదు. బంగారు తెలంగాణ తెస్తానని మాత్రమే చెప్పారు. అంతేకాదు సర్వేలు చేయించుకుని సానుకూల ఫలితాలు రావడంతో కొంత కూల్ గానే ఉన్నారు. అందుకు తగినట్లుగానే 2018 ఎన్నికల్లో భారీ సీట్లు సాధించి విపక్షాలకు ఝలక్ ఇవ్వగలిగారు.
తేడా కొడుతుండటంతో...
కానీ ఈసారి మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది. ఇచ్చిన హామీలు అమలుపర్చకపోవడం, కొన్ని వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి పార్టీపైనా, ప్రభుత్వంపైన అసంతృప్తి ఉందని గులాబీ బాస్ పసిగట్టారు. అందుకే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి.. అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పటికే 70కి పైగా శానసనభ నియోజవకర్గాల్లో ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రచారం ముగిసే సమయంలోగా మరొక 30 నియోజకవర్గాలను పర్యటించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఎక్కడో డౌట్ కొడుతుంది. కాంగ్రెస్ వేగంగా ముందుకు దూసుకు రావడంతో కేసీఆర్ చాలా వరకూ అప్రమత్తమయినట్లే కనిపిస్తుంది. మరోసారి సెంటిమెంట్ తో పాటు కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుందో చెబుతూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని హామీలు...
అంతే కాదు ఇప్పటికే మ్యానిఫేస్టోను విడుదల చేసిన కేసీఆర్ మరికొన్ని వరాలను ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచాం. ఈ నెల 25వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే సభలో కొత్త హామీలతో జనం ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అది ఏరకమైన హామీలన్నది తెలియకున్నా కాంగ్రెస్ కు కొంత ఎడ్జ్ ఉందని తెలిసిన తర్వాతనే చివరి ప్రయత్నంలో కేసీఆర్ మరికొన్ని హామీలను ఇచ్చేందుకు సిద్ధమువుతున్నారని చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా ఈసారి ఇబ్బంది పెడుతుందేమోనన్న అనుమానం కల్వకుంట్ల వారి మదిలో తొలుస్తుంది. మరి ఏ రకమైన హామీలు ఇస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story