Fri Nov 22 2024 20:06:28 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ఆపనేల...తర్వాత బతిమాల నేల.. అందరూ షర్మిలలా ఉంటారా...?
కాంగ్రెస్ గెలుస్తామన్న ఊపులో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. కమ్యునిస్టులను సరిగా హ్యాండిల్ చేయలేకపోయింది
కాంగ్రెస్ గెలుస్తామన్న ఊపులో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. గతంలో కల్లా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ కు మెరుగైన పరిస్థితులున్నాయన్నది కాదనలేని వాస్తవం. అయితే గెలిచేటంతగా అంటే చెప్పలేం. ఫిఫ్టీ ...ఫిఫ్టీ ఛాన్స్. సర్వేలు అధికభాగం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే వస్తున్నాయి. ఇది చూసి నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. అతి విశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. ధీమా పెరిగినప్పుడు సహజంగా దొర్లే తప్పులే ఇప్పడు కాంగ్రెస్ కూడా చేస్తుంది. రెండు జాబితాలు కాంగ్రెస్ విడుదల చేసింది. అందులో అక్కడకక్కడ అసంతృప్తులు వినిపించినా అభ్యర్థులజాబితాను ఖరారు చేయడంలో కాంగ్రెస్ ఎనభై శాతం సక్సెస్ అయిందనే చెప్పాలి. మిగిలింది ఎలక్షనీరింగ్ ఉంది.
అన్నింటిలో ముందున్నా...
ప్రచారంలో కూడా కాంగ్రెస్ దూసుకు వెళుతుంది. పాజిటివ్ అప్రోచ్ తోనే తాము ప్రజల ముందుకు వెళతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి కొంత వరకూ బాగానే ఉన్నాయి. ప్రధానంగా మహిళలు, నిరుద్యోగులు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులవుతున్నారు. దీనిని సరిహ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటనలు కూడా విజయవంతమయ్యాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారి సభలకు జనాన్ని తరలించారనుకున్నా... ప్రజల నుంచి సభల్లో వారి ప్రసంగాలకు వస్తున్న స్పీచ్ కు మంచి రెస్పాన్స్ వస్తుండటంలో కాంగ్రెస్ నేతలు ఇక తమ విజయానికి ఢోకా లేదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది.
షర్మిలలా భావించి..
తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఎదుర్కొనాలంటే ఆషామాషీ కాదు. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో బలం ఉన్నప్పటికీ ఓట్లు చీలకుండా చూసుకోగలగాలి. కోదండరామ్ పార్టీకి ఒక్క టిక్కెట్ ఇవ్వకుండా నచ్చ చెప్పుకోగలిగారు. అలాగే వైఎస్ షర్మిలను ఎలా బుజ్జగించారో తెలియదు కానీ ఆమె కూడా బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. ఇది పార్టీ విజయావకాశాలను మరింత పెరిగింది. ఇక మనకు తిరుగులేదనుకుని కాంగ్రెస్ విర్రవీగుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కేసీఆర్ బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ వంటి రాష్ట్రాల్లో కమ్యునిస్టుల ప్రభావాన్ని కూడా తోసిపారేయలేం. కానీ వారి విషయంలో అనుసరించిన వైఖరిని మాత్రం తప్పుపట్టాల్సిందే.
కమ్యునిస్టుల దారి....
ఎంతకాలం వెయిట్ చేస్తారు వాళ్లు మాత్రం. డెడ్ లైన్ విధించినా స్పందన లేదు. దీంతో సీీపీఎం పథ్నాలుగు మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. జాబితా ప్రకటించగానే అప్పుడు కాంగ్రెస్ నేతలు మేల్కొన్నారు. స్వయానా జానారెడ్డి ఫోన్ చేసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో మాట్లాడారు. అలాగే భట్టి విక్రమార్క కూడా ఫోన్ చేసి జాబితాను ఆపమని కోరారు. అయితే తమ్మినేని వీరభద్రం మాత్రం తాము జాబితాను ప్రకటించేశామని, వీలుండదని అన్నారు. సీపీఐ కూడా అదే బాటలో పయనించే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఏదో అనుకుంటే మరేదో జరుగుతుంది. ఆలస్యం అమృతం... విషం అన్న సామెత అక్షరాలా నిజమవుతున్నట్లుంది. ఇచ్చే నాలుగు సీట్ల విషయంలో ముందుగా క్లారిటీ ఇచ్చి ఉంటే ఈ బతిమాలటాలు. బుజ్జగింపులు వంటివి ఉండేవి కావు కదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
Next Story