Mon Dec 23 2024 09:38:22 GMT+0000 (Coordinated Universal Time)
Congress Final List : 118 చోట్ల కాంగ్రెస్ పోటీ.. తుది జాబితాలో మార్పులు
కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేసింది. నేటితో నామినేషన్లు గడువు ముగియనుండటంతో అర్ధరాత్రి అభ్యర్థులను ఖరారు చేసింది
కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేసింది. నేటితో నామినేషన్లు గడువు ముగియనుండటంతో అర్ధరాత్రి అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పఠాన్ చెర్వు అభ్యర్థిని మారుస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అలాగే తుంగతుర్తిలోనూ మోత్కుపల్లి నరసింహలు, అద్దంకి దయాకర్ లు కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించింది. సూర్యాపేట్ మాత్రం రామిరెడ్డి దామోదర్ రెడ్డికే మరలా టిక్కెట్ కేటాయించింది. పటేల్ రమేష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. చార్మినార్ స్థానంలోనూ మహ్మద్ ముజీబ్ షరీఫ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఒక్క సీపీఐకి మాత్రమే కొత్తగూడెం సీటును కేటాయించింది. 118 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.
01. పటాన్ చెర్వు - కాటా శ్రీనివాస్ గౌడ్
02. ఛార్మినార్ - మహ్మద్ ముజీబ్ షరీఫ్
03. మిర్యాలగూడ - బత్తుల లక్ష్మారెడ్డి
04. సూర్యాపేట్ - రామిరెడ్డి దామోదర్ రెడ్డి
05. తుంగతుర్తి - ఎం. శామ్యూల్
Next Story