Thu Dec 19 2024 13:46:10 GMT+0000 (Coordinated Universal Time)
Priyanka Gandhi : ప్రియాంక కొత్తగూడెం సభ రద్దు
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కొత్తగూడెం సభను రద్దు చేసుకున్నారు
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కొత్తగూడెం సభను రద్దు చేసుకున్నారు. వాతావరణం అనుకూలించక పోవడంతో ఆమె సభను రద్దు చేసుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ లోని తాజ్ హోటల్ లో ఆమె రాత్రి బస చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రియాంక గాంధీ పాలకుర్తి, హుస్నాబాద్ సభల్లో పాల్గొన్న అనంతరం కొత్తగూడెం వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆమె తన పర్యటన రద్దు చేసుకున్నారు.
రేపు ఉదయం ....
రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో జరిగే ప్రచారసభల్లో ఆమె పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల నిమిత్తం తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రియాంక గాంధీ రేపు కూడా ప్రచారంలో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ కొత్తగూడెం సభ రద్దు కావడంతో ఆ ప్రాంత ప్రజలు నిరాశకు లోనయ్యారు. క్యాడర్ కూడా ప్రియాంక గాంధీ కోసం ఎదురు చూసిన కార్యకర్తలు వెనుదిరిగారు.
Next Story