Mon Dec 23 2024 10:56:28 GMT+0000 (Coordinated Universal Time)
Priyanka Gandhi : నేడు తెలంగాణకు ప్రియాంక
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రియాంక నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మ్యానిఫేస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేేస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కసితో అందరూ ఈసారి కలసికట్టుగా పనిచేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో...
ఈరోజు ఉదయం ఆమె నాందేడ్ కు చేరుకున్నారు. నాందేడ్ నుంచి బయలుదేరి హెలికాప్టర్ లో ఖానాపూర్ కు రానున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకూ ఆసిఫాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆమె తిరిగి నాందేడ్ మీదుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రియాంక గాంధీ పర్యటన కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ జనసమీకరణకు నేతలు సిద్ధమయ్యారు.
Next Story