Thu Nov 07 2024 06:41:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections Counting : మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం... అందరిలోనూ టెన్షన్
మరికాసేపట్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది
మరికాసేపట్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎనిమిది గంటలకు తొలుత పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలట్ లెక్కింపు ప్రక్రియ అరగంట సేపు ముగుస్తుంది. ఆ తర్వాత 80 ఏళ్ల దాటిన వృద్ధులు ఇంటి వద్ద వేసిన ఓట్లను లెక్కిస్తారు. అవి అయిపోయిన తర్వాత ఈవీఎంలను తెరుస్తారు.
49 కేంద్రాల్లో....
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో పథ్నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు రిటర్నింగ్ అధికారి, అదనపు రిటర్నింగ్ అధికారితో పాటు టేబుల్ కు ముగ్గురిని నియమించారు. వీరంతా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఇక్కడ అబ్జర్వర్ తో పాటు, కౌటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ కూడా ఉంటారు.
ప్రధాన పోటీ...
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఉందని తేలింది. ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ దే అధికారాన్ని దక్కించుకుంటుందని తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు కొన్ని ఏజెన్సీలు హంగ్ ఏర్పడవచ్చని కూడా తెలిపాయి. కొన్ని బీఆర్ఎస్ కు ఆధిక్యం వస్తాయని తేల్చాయి. ఈనేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అవుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story