Fri Dec 20 2024 05:51:49 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : బీర్ బాటిల్స్ పై అభ్యర్థుల ప్రచారమా? ఇందులో నిజమెంత?
ఎన్నికల వేళ సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు అనుకూలంగా కొందరు.. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మరికొందరు ఉపయోగించుకుంటున్నారు
ఎన్నికల వేళ సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా కొందరు.. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మరికొందరు ఉపయోగించుకుంటున్నారు. అభ్యర్థులపై లేని పోని నిందలు వేయడానికి సోషల్ మీడియాను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అభ్యర్థులు తాము చేయని తప్పును కూడా నెత్తిన వేసుకుంటున్నారు. అదే సమయంలో వాటికి వివరణ ఇచ్చుకునే సమయం లేక వదిలేసే వారు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో అభ్యర్థులు కంగారు పడిపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
వ్యతిరేక ప్రచారం....
తాజాగా నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం ఫొటోలతో కూడిన బీర్ బాటిల్స్ ను పంపిణీ చేస్తున్నట్లు ఆయన ప్రత్యర్థి వర్గం ప్రచారాన్ని ప్రారంభించింది. బీరు బాటిళ్లపై వేముల వీరేశం స్టిక్టర్లను అతికించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కావాలనే క్రియేట్ చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. స్టిక్కర్లు వేసి ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి అయినా బీరు బాటిల్స్ ను జనానికి పంచరు. కావాలనే ఇరుకున పెట్టాలనే కొందరు ఈ స్టిక్కర్లను బీరు బాటిళ్లకు అతికించి పోస్ట్ చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని నకిరేకల్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Next Story