Fri Dec 27 2024 18:12:03 GMT+0000 (Coordinated Universal Time)
ధర్మపురి బరిలో గల్ఫ్ నాయకురాలు
గల్ఫ్ వలస కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న గల్ఫ్ జెఏసి రాష్ట్ర కార్యదర్శి బూత్కూరి కాంతకు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ధర్మపురి ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి మంగళవారం కరీంనగర్ లో కాంతకు బీ-ఫారం అందజేశారు.
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్ కేటాయింపు
గల్ఫ్ వలస కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న గల్ఫ్ జెఏసి రాష్ట్ర కార్యదర్శి బూత్కూరి కాంతకు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ధర్మపురి ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి మంగళవారం కరీంనగర్ లో కాంతకు బీ-ఫారం అందజేశారు.
విదేశాలలో తన భర్తను కోల్పోయి బాధలు అనుభవించిన బాధితురాలు బూత్కూరి కాంత గల్ఫ్ కార్మిక నాయకురాలిగా ఎదిగారు. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా ప్రతిభావంతంగా పనిచేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మహిళా నాయకురాలికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి పలువురు గల్ఫ్ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె గెలుపుకు కృషి చేస్తామని అన్నారు.
Next Story