Fri Dec 27 2024 18:20:13 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీ పోరులో గల్ఫ్ లీడర్స్
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో... కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి వేములవాడ నుంచి, బీజేపీ గల్ఫ్ విభాగం అధ్యక్షులు నరేంద్ర పన్నీరు జగిత్యాల నుంచి ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు. ఈ రెండు ప్రధాన పార్టీలు వీరికి మొండి చేయు చూపాయి.
కేసీఆర్ లాగా రెండు స్థానాల్లో గల్ఫ్ నేతలు కూడా పోటీ చేసే ఆలోచన
గల్ఫ్ నేతలకు టికెట్లు ఇవ్వని ప్రధాన పార్టీలు. అక్కున చేర్చుకున్న నేతాజీ పార్టీ
వేములవాడ, కోరుట్ల, నిర్మల్ లలో సింహం గుర్తుతో పోటీ
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో... కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి వేములవాడ నుంచి, బీజేపీ గల్ఫ్ విభాగం అధ్యక్షులు నరేంద్ర పన్నీరు జగిత్యాల నుంచి ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు. ఈ రెండు ప్రధాన పార్టీలు వీరికి మొండి చేయు చూపాయి. బీఎస్పీ కూడా గల్ఫ్ కార్మిక నాయకుల అభ్యర్థనను పట్టించుకోలేదు.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గల్ఫ్ కార్మికుల ఆత్మగౌరవ పోరాటాన్ని గుర్తించి ముగ్గురు గల్ఫ్ సంఘాల నేతకు టికెట్లు కేటాయించింది. వేములవాడ నుంచి గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, కోరుట్ల నుంచి గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులు, రైతుల ఉమ్మడి అభ్యర్థిగా చెన్నమనేని శ్రీనివాస్ రావు (సిఎస్ఆర్), నిర్మల్ నుంచి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ముగ్గురు అభ్యర్థులకు ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి బీ-ఫారాలు అందజేశారు. నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల గుర్తు సింహం.
గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (జిడబ్ల్యుఏసి) వ్యవస్థాపక అధ్యక్షులు క్రిష్ణ దొనికెని సిరిసిల్ల నుంచి పోటీ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కాగా కొన్ని సమీకరణాల వలన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిరిసిల్ల టికెట్ ను పెండింగ్ లో ఉంచింది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం, బీజేపీ రెబల్ లగిశెట్టి శ్రీనివాస్, గల్ఫ్ నేత క్రిష్ణ దొనికెని ముగ్గురిలో సింహం గుర్తు ఎవరిని వరిస్తుందో చూడాలి.
బీఆర్ఎస్ అధ్యక్షులు కెసీఆర్ రెండు చోట్లా పోటీ చేసిన విధంగా గల్ఫ్ కార్మిక నాయకుడు క్రిష్ణ దొనికెని సిరిసిల్ల తోపాటు ఆర్మూర్ నుంచి కూడా రంగంలోఉండాలనే ఒక సూచన వచ్చింది. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ వేములవాడతో పాటు బాల్కొండలో కూడా పోటీ చేయాలనే ప్రతిపాదన ఉంది.
గుగ్గిల్ల రవిగౌడ్
స్వదేశ్ పరికిపండ్ల
చెన్నమనేని శ్రీనివాస్ రావు
క్రిష్ణ దొనికెని
Next Story