Mon Dec 23 2024 11:41:00 GMT+0000 (Coordinated Universal Time)
BJP : బీజేపీ మ్యానిఫేస్టోలో కీలక అంశాలివే.. ఇన్ని వరాలా?
రేపు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. మ్యానిఫేస్టోలో అనేక కీలక అంశాలను చేర్చారు
రేపటి బీజేపీ మ్యానిఫేస్టోలో ఏ ఏ అంశాలు ఉండబోతున్నాయన్న చర్చ జరుగుతుంది. రేపు సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. తెలంగాణలోని సకలజనులను ఆకట్టుకునే విధంగా మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. తెలంగాణ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని చెప్పానున్నారు. ధరణి స్థానంలో "మా భూమి" పేరుతో ప్రత్యేక పోర్టల్ ను తయారు చేస్తామని చెప్పనున్నారు. కేంద్ర ప్రభుత్వాల పథకాల అమలు కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనున్నారు. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ప్రకటన చేయనున్నారు. ఆడబిడ్డ భరోసా కింద వచ్చే నాలుగేళ్లు రెండు లక్షల ఆర్థిక సాయం చేయనున్నామని చెప్పనున్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని...
గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనున్నారు. మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా, నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని కూడా మ్యానిఫేస్టోలో బీజేపీ చెప్పనుంది. అన్ని పంటలకు బీమా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందన్న హామీ ఇవ్వనున్నారు. అయోధ్య, వారణాసికి వృద్ధులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. రైతుల కోసం ఉచితంగా ఎరువులు, పురుగు మందుల సరఫరా చేస్తామని తెలపనుంది.
ఉపాధి అవకాశాల మెరుగుకు...
అలాగే ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేకంగా దృష్టి పెడుతూ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయనున్నామని ప్రకటించనుంది. ప్రతిజిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఇండ్రస్ట్రియల్ కారిడార్ ను ఏరపటు చేస్తాం. రోహింగ్యాలను, అక్రమ వలసదారులను పంపిచేస్తామని చెప్పనుంది. దీంతో పాటు ఉద్యోగులకు పీఆర్సీపై కమిషన్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఐదేళ్లకు ఒకసారి కమిషన్ ఏర్పాటు చేస్తామని మ్యానిఫేస్టోలో చెప్పనుంది. జీవో 317 ను పునస్సమీక్ష చేస్తామని చెప్పనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పనున్నారు. ఉజ్వల లబ్దిదారులకు ఉచితంగా ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్ లను ఇస్తామన్న హామమీకూడా ఉండనుంది.
Next Story