Thu Dec 19 2024 16:01:48 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : రేపు పవన్ రోడ్ షోలు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు వరంగల్లో జరగనున్న వరంగల్ రోడ్ షోలలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే రకంగా ఈ నెల 26న అమిత్ షాతో కలసి పవన్ హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించనున్నారని బీజేపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వరంగల్ తూర్పు, పశ్చిమ....
రేపు పవన్ కల్యాణ్ వరంగల్ లోనూ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్ షోలు చేయనున్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. రెండు చోట్ల పవన్ కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. దీంతో పార్టీకి కొంత సానుకూలత వస్తుందని భావిస్తున్నారు.
Next Story