Fri Nov 22 2024 16:26:01 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల ప్రచారంలో గల్ఫ్ సంఘాల నాయకులు
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. వారికోసం గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ఎన్నారై పాలసీ తీసుకురావడమే తమ లక్ష్యమని దుబాయి కేంద్రంగా పనిచేసే ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర అన్నారు.
కోరుట్ల బరిలో గల్ఫ్ జెఏసి అభ్యర్థి సిఎస్ఆర్
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. వారికోసం గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ఎన్నారై పాలసీ తీసుకురావడమే తమ లక్ష్యమని దుబాయి కేంద్రంగా పనిచేసే ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర అన్నారు. గల్ఫ్ కార్మికులు గ్రామాల్లో లేరనే సాకుతో వారి పేర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుల నుంచి తొలగిస్తున్నాయని ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతామని ఆయన అన్నారు.
గల్ఫ్ సంఘాలు బలపర్చిన కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాస్ రావు కు మద్దతుగా గల్ఫ్ సంఘాల ప్రతినిధుల బృందం శుక్రవారం మల్లాపూర్ మండలం గుండంపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గల్ఫ్ కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 32 నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిలో ప్రభావితం చేయగల సత్తా గల్ఫ్ ఓటు బ్యాంకుకు ఉన్నదని అన్నారు.
కోరుట్ల నుంచి చెన్నమనేని శ్రీనివాస రావు, వేములవాడ నుంచి గుగ్గిల్ల రవిగౌడ్, నిర్మల్ నుంచి స్వదేశ్ పరికిపండ్ల, ధర్మపురి నుంచి బూత్కూరి కాంత, ఆర్మూర్ నుంచి బూస రాకేష్ యాదవ్ అయిదుగురు గల్ఫ్ జెఏసి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్ పై సింహం గుర్తుతో పోటీలో ఉన్నారని, సిరిసిల్ల నుంచి క్రిష్ణ దొనికెని ఇండిపెండెంట్ గా రంగంలో ఉన్నారని వీరందరినీ గెలిపించాలని భీంరెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ జెఏసి నాయకులు సంగెము మోహన్ రెడ్డి, రఘు ఎలిగేటి, గల్ఫ్ రిటనీలు లక్ష్మణ్, సాయిలు, బుచ్చిరెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story