Fri Dec 20 2024 17:32:08 GMT+0000 (Coordinated Universal Time)
Congress : వచ్చేది కాంగ్రెస్ .. గెలిచేది మేమే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కుత్బుల్లాపూర్ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని తెలిసి మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మోదీ నిజాలు చెప్పరని, ఆయన సోదరుడు కేసీఆర్ కూడా నిజాలు చెప్పరని ఖర్గే ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగితే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. మోదీ ప్రభుత్వం రైతుల నుంచి వ్యతిరేకత రాగానే చట్టాలను వెనక్కు తీసుకున్నారన్నారు.
ఆ రెండు రాష్ట్రాల్లోనూ...
కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. ఇక్కడ కూడా అదే చేస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే గెలవబోతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందిస్తుందని తెలిపారు. మీ సమస్యలకు వెనువెంటనే పరిష్కారం చూపుతుందని చెప్పారు. బీఆర్ఎస్ తో కలసి మోదీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని చూస్తున్నారన్నారు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ ను గెలిపించేందుకు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణలో రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
Next Story