Mon Dec 23 2024 13:42:22 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఆ పన్నెండు మందిని అసెంబ్లీ గేటు తాకనివ్వకండి : రేవంత్ రెడ్డి
పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దని పీీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ మారే వాళ్లకు మీ తీర్పు గుణపాఠం కావాలని కోరారు. నకిరేకల్ సభలో ఆయన మాట్లాడారు. ఇసుక మీద ఎవరైనా మేడిగడ్డ బ్యారేజీ కడతారా? అని ప్రశ్నించారు. మందేసి కట్టాడా? మతిలేక కట్టాడా? అని రేవంత్ ఫైర్ అయ్యారు. నాడు ఈ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ ద్వారా నీళ్లు ఇవ్వాలని నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోరాడి నీళ్లు తెచ్చారన్నారు. పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వితే నీళ్లు వస్తాయని ఎంత చెప్పినా కేసీఆర్ వినలేదన్నారు.
బక్కోడు కాదు... బకాసురుడు...
కాళేశ్వరంలో లక్ష కోట్లు మింగినోడు బక్కోడు ఎలా అవుతాడు? బకాసురుడవుతాడని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు అరవై కోట్లు అప్పులు చేస్తే, కేసీఆర్ పదేళ్లలో ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. కేసీఆర్ దొంగనోటు లాంటోడుఅని, జిల్లాలో ఎక్కడా కూడా బీఆర్ఎస్ జెండా ఎగరకూడదని అన్నారు. నల్లగొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని ఆయన అన్నారు.
యువత ఏకంకకండి....
ఇక్కడ ఉన్న బలమైన కార్యకర్తలు కాంగ్రెస్ కు మరెక్కడా లేరన్నారు. వెయ్యి ఏనుగుల బలంతో డిసెంబరు 3న కల్వకుంట్ల కేసీఆర్ ను బొందపెట్టడం ఖాయమని చెబుతున్నామని అన్నారు. తెలంగాణలో పదేళ్లుగా ఉద్యోగాలు ఖాళీ భర్తీ చేయలేదని, రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని అన్నారు. కేసీఆర్ నౌకరీ ఊడగొట్టే బాధ్యత యువకులదేనని, ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు మీరు సహకరించాలని కోరారు.
Next Story