Mon Dec 23 2024 10:42:23 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ తో మోదీ ఏం మాట్లాడారంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఎల్.బి. స్టేడియంలో జరిగిన బీసీ సదస్సులో మోదీ పవన్ తో కొద్దిసేపు ముచ్చటించారు. అయితే ఆయన ఏం మాట్లాడారో తెలియదు కాని, తాజా రాజకీయ పరిణామాలపైనే మోదీ చర్చించినట్లు తెలిసింది. సభా వేదికపై మోదీ పక్కనే పవన్ కల్యాణ్ ఆశీనులు కావడంతో ఆయన ఇతర సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పవన్ తో కాసేపు ముచ్చటించడం కనిపించింది.
ఏం మాట్లాడరన్న దానిపై....
ప్రధానంగా మోదీ పవన్ కల్యాణ్ తో ఏం మాట్లాడరన్న దానిపై చర్చ జరుగుతుంది. మాట్లాడింది కొద్ది సేపు అయినా అది ఏపీ రాజకీయాల గురించా? లేక తెలంగాణ రాజకీయాలకే పరిమితమయ్యారా? అన్నది చర్చ జరుగుతుంది. పవన్ తో మోదీ ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనను కలవాలని పవన్ ను ప్రధాని మోదీ అన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story