Thu Dec 19 2024 13:58:06 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : సత్తా చూపుతాం.. గెలిచి తీరుతాం
రానున్న ఎన్నికల్లోనూ బీజేపీ విజయాన్ని దక్కించు కుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించిందని, రానున్న ఎన్నికల్లోనూ అదే విజయాన్ని దక్కించుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ రెండేనని ఆయన అన్నారు. రెండూ అవినీతి పార్టీలేనని అన్నారు. తెలంగాణలో రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతిభావంతులని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ కలసి పనిచేస్తున్నాయని అన్నారు. అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ కు ప్రాణమిత్రుడు...
కాంగ్రెస్ కు కేసీఆర్ ప్రాణమిత్రుడన్న మోదీ బీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి చూపించామన్నారు. బీజేపీ అన్ని వర్గాలను సమానంగా చూస్తుందన్నారు. బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పొరపాటున కాంగ్రెస్ ను ఎన్నుకుంటే బీఆర్ఎస్ కార్బన్ పాలన వస్తుందన్నారు. తెలంగాలో కుటుంబ పాలన నుంచి విముక్తి లభించాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ఆయన అన్నారు.
Next Story