Thu Dec 19 2024 13:46:10 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : లాస్ట్ పంచ్ కోసం మోదీ వస్తున్నారు
ఈరోజు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీలూ తమ చివరి పంచ్ లు వేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈరోజు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. మధ్యాహ్యం రెండు గంటలకు కామారెడ్డిలో ప్రారంభమయ్యే సభతో నేటి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మూడు రోజుల పాటు ఏకబిగిన ప్రచారం చేస్తారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదన్న కారణంతో ప్రధాని మూడు రోజుల పాటు కంటిన్యూగా తెలంగాణలోనే పర్యటిస్తున్నారు.
వరస సభలతో...
మధ్యాహ్నం దుండిగల్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ప్రధాని నేరుగా బయలుదేరి కామారెడ్డి వెళతారు. అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు తుక్కుగూడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి రాజ్భవన్ లోనే బస చేస్తారు. రేపు దుబ్బాక, నిర్మల్లో జరిగే సభల్లో పాల్గొంటారు. అక్కడ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు. 27వ తేదన మహబూబాబాద్, కరీంనరగ్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరిగే రోడ్ షోలలో పాల్గొంటారు.
Next Story