Fri Nov 22 2024 19:34:38 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : నేటి నుంచి నామినేషన్ల సందడి.. మంచి ముహూర్తం చూసుకుని
తెలంగాణ ఎన్నికల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది
తెలంగాణ ఎన్నికల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుండటంతో అనేక మంది అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు వేసే అవకాశముంది. ఈ నెల 3వ తేదీ, మంచి ముహూర్తం ఉండటంతో ఎక్కువ మంది నేతలు ఈరోజు నామినేషన్ వేసే అవకాశముందని తెలిసింది. నామినేషన్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు చేశారు.
రాజకీయ పార్టీలన్నీ...
ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 119 స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బీ ఫారాలాను కూడా మంజూరు చేసింది. కాంగ్రెస్ రెండు విడతలుగా జాబితాను విడుదల చేసింది. కమ్యునిస్టు పార్టీలతో పొత్తులపై తేల్చాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా మూడు విడతలుగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ పార్టీ కూడా జనసేన పార్టీకి ఇచ్చే సీట్లను ఖరారు చేయాల్సి ఉంది.ఇప్పటి వరకూ ఖరారయిన అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు వేయనున్నారు.
ప్రచారం నిర్వహించాల్సి ఉండటంతో...
ఈ నెల 3వ తేదీ నుంచి పదో తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబరు 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 3వ తేదీన ఎన్నికల కౌంటంగ్ జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ప్రక్రియ ప్రధానమైన భాగం కావడంతో దానిని పూర్తి చేసుకుని ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అభ్యర్థులు భావిస్తారు. అందుకే నేటి నుంచి అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. శుభముహూర్తం చూసుకుని మరీ తమ నామినేషన్లను అధికారులకు అందచేయనున్నారు.
Next Story