Telangana Elections : ఇద్దరు మాజీ సీఎంల ముద్దుల కొడుకులు గెలుస్తారా? వారి గ్రాఫ్ ఎలా ఉంది?
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు తెలంగాణ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. వారి గెలుపోటములపై రాజకీయంగా చర్చ జరుగుతుంది.
ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు అంటే దాదాపు రాజకీయంగా అనుభవాన్ని, క్యాడర్ ను సంపాదించుకున్నట్లే. తమకంటూ ఒక వర్గాన్ని ముఖ్యమంత్రులు అందరూ ఏర్పాటు చేసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ అంత పెద్ద పదవిలో ఉండి తమ తనయులను వారసులుగా తీసుకు వచ్చేందుకు వాళ్లేమీ ప్రయత్నాలు చేయాల్సిన పనిలేదు. ఆటోమేటిక్ గా జనం ఆదరిస్తారు. వారంతట వారే రాజకీయాల్లో రాటు దేలుతారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకుల రాజకీయ భవితవ్యం పై చర్చ జరుగుతుంది. అంతేకాదు ఇద్దరూ తన తండ్రులను ముఖ్యమంత్రులను చేసిన కాంగ్రెస్ లో ఇమడలేకపోయారు. ఇతర పార్టీల్లో చేరి ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారు ఈసారైనా తండ్రుల ప్రతిష్టను నిలబెడతారా? లేదా? అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వారి గెలుపోటములపై "తెలుగు పోస్ట్" ఫోకస్.