Mon Dec 23 2024 07:04:34 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : ఓటర్లకు మోదీ పిలుపు
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. " తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండగను బలోపేతం చేయాలని పిలుపునిస్తున్నాను. మరీ ముఖ్యంగా మొదటి సారి ఓటు వేస్తున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్...
మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు మీ ఓటు తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి అంటూ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓటర్లకు పిలుపు నిచ్చారు. అవినీతి రహిత పేదల పక్షపాత ప్రభుత్వం మాత్రమే తెలంగాణ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా పనిచేస్తుందని, ప్రజల సాధికారతే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్దయెత్తున తరలి రావాలని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story