Mon Dec 23 2024 10:44:50 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మూడు రోజుల్లో ఎంత డబ్బు, మద్యం పట్టుబడిందో తెలుసా?
తెలంగాణలో ఎన్నికల కోడ్ తర్వాత పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు..
తెలంగాణలో ఎన్నికల కోడ్ తర్వాత పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడుతోంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారం, వెండి, మద్యం ఇలా విలువైన వస్తువులకు సంబంధించి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా ఉన్నవాటిని పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి దాదాపు 20 కోట్ల డబ్బులనును పోలీసు అధికారులు సీజ్ చేశారు
అక్టోబర్ 11వ తేదీన ఒక్కరోజే 6 కోట్ల 20 ఏడు లక్షల రూపాయలను ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా సీజ్ చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 12 ఉదయం వరకు దాదాపు 20 కోట్ల 43 లక్షల రూపాయలను సీజ్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అన్ని చెక్‌పోస్టుల దగ్గర అధికారులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి.. సరైన దృవీకరణ పత్రాలు లేని నగదును స్వాధీనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మద్యం సీజ్
అదే మద్యం విలువ చూస్తే మాత్రం నోరెళ్లపెట్టాల్సిందే. ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్ 9 నుంచి ఈరోజు ఉదయం వరకు 86 లక్షల 92,000 విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే 31 వేల 730 లీటర్ల మద్యం తనిఖీల్లో పట్టుబడింది. నిన్న ఒక్కరోజే 19317 లీటర్ల మద్యం పట్టుబడగా.. దాని విలువ 31 లక్షల 36వేల రూపాయలుగా అధికారులు తెలిపారు.
బంగారు అభరణలు
ఎన్నికల కోడ్ అమలు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 258 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో డబ్బు మద్యం కాకుండా బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేస్తున్నారు. కోడ్ అమలవుతున్న అక్టోబర్ 9 నుండి ఇప్పటివరకు 14 కోట్ల 65 లక్షల 50 వేల 852 రూపాయల విలువగల బంగారం, వెండి, వజ్రాలను సీజ్ చేసినట్లు చెప్పారు.
మత్తు పదార్థాలు..
ఇక మత్తు పదార్థాలు కూడా ఈ తరీక్షల్లో బయటపడుతున్నాయి ఇప్పటివరకు 89 లక్షల 2వేల రూపాయల విలువగల మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో లాప్‌టాప్‌లు, వాహనాలు ఇతర వంట సామాగ్రి, స్పోర్ట్స్ థింగ్స్, చీరలు కూడా సీజ్ చేశారు. వాటి విలువ 22 లక్షలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు.
Next Story