Fri Dec 20 2024 11:58:01 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Finals 2023 : ఈరోజు ప్రచారానికి కూడా ఇబ్బందులే.. వరల్డ్ కప్ ఫైనల్స్ కావడంతో
తెలంగాణ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అయితే ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతుండటంతో ప్రచారంలో ఇబ్బంది కలగనుంది
తెలంగాణ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. అందుకోసం ప్రచార సమయం ముగియనుండటంతో అన్ని పార్టీలూ తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అయితే ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుండటంతో బయటకు ఎవరూ వచ్చే అవకాశం లేదు. పైగా ప్రచార సభలు కూడా వెలవెల బోయే అవకాశాలున్నాయని అన్ని పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటకు ఎవరూ రాకపోగా ప్రచార సభలకు కూడా హాజరీ శాతం తక్కువగా ఉంటుందని అంచనాలు వినపడుతున్నాయి.
ఫైనల్స్ వీక్షించేందుకు...
భారత్ - ఆస్ట్రేలియా ఫైనల్స్ వీక్షించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. అందులోనూ ప్రధానంగా నగరాల్లో ఈ ఫీవర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆదివారం ఫైనల్స్ జరుగుతుండటంతో మ్యాచ్ కు ఇచ్చే ప్రాధాన్యత ఎన్నికలకు ఇవ్వరన్నది అందరికీ తెలుసు. అందుకే అభ్యర్థులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోనే పర్యటించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉండటంతో ఈరోజు పూర్తిగా వృధా అయినట్లేనని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story