Thu Dec 19 2024 06:56:12 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : రేపు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది.
రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి పథ్నాలుగు టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్లోనే 16 లెక్కింపు కేంద్రాలున్నాయి. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ విధించారు.
భారీ భద్రత నడుమ...
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలట్లను లెక్కిస్తారు. ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. రేపు ఉదయం స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకు వచ్చిన ఈవీఎంలను కౌంటింగ్ ఏజెంట్ల ఎదుట ఓపెన్ చేస్తారు. తర్వాత లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎలాంటి ఊరేగింపులు, ప్రదర్శనలు చేయకూడదని పోలీసులు నిషేధం విధించారు.
Next Story