Telangana: తెలంగాణలో ఆ మూడు రోజులు మోడీ సుడిగాలి పర్యటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. వివిధ పార్టీల ప్రచారం హోరెత్తిపోతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. వివిధ పార్టీల ప్రచారం హోరెత్తిపోతోంది. నేతల మాటల యుద్ధాలు.. విమర్శలు, ప్రతి విమర్శలు ఇలా ఒక్కటేమిటి ఇలా సరికొత్త పదాలు, పంచ్‌డైలాగులతో రాష్ట్ర రాజకీయాలు దద్దరిల్లిపోతున్నాయి. ఇక ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. ఇతర పార్టీలకు చెందిన బడా నేతలు ఢిల్లీ నుంచి తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇక మరింత వేడెక్కనుంది. ఢీ అంటే ఢీ అన్నట్లు ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పార్టీలు మలి విడత ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్దమవుతున్నాయి. ఈ నెల 13 నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రోజు మూడు నుంచి నాలుగు సభలు నిర్వహిస్తారు. ఇక కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక రంగంలోకి దిగనున్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారం చేయనున్నారు.
తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 25, 26, 27న తెలంగాణలో మోడీ ప్రచారం చేయనున్నారు. 25న కరీంనగర్ జన గర్జన సభలో మోదీ పాల్గొంటారు. 26న నిర్మల్ జన గర్జన సభలో ప్రధాని పాల్గొంటారు. ఇక 27న హైదరాబాద్‌లో జరిగే భారీ రోడ్‌షోలో మోదీ పాల్గొంటారు. ఇలా ఢిల్లీ నుంచి పలువురు నేతలు తెలంగాణలో వాలిపోతున్నారు.