Elections: మీరు ఎవరికి ఓటు వేశారో ఇలా తెలుసుకోవచ్చు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ముఖ్యం. ఓటు వేసేందుకు హడావుడిగా పోలింగ్ బూత్‌కు
Elections: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ముఖ్యం. ఓటు వేసేందుకు హడావుడిగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేస్తుంటారు. కానీ ఓటు వేశాకా మనం అనుకున్న అభ్యర్థికి ఓటు పడిందా? లేదా అనే సందేహం వస్తుంటుంది. అలాంటి సమయంలో ఓటు ఎవరికి వేశామనేది తెలుసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల సంఘం పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. టెక్నాలజీతో ఈవీఎంలో వేసిన ఓటును ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి వేశామో చూసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది కమిషన్.
ఈ నేపథ్యంలో వేసిన ఓటు వీఎంలలో తెలసుకోవచ్చు. అయితే ఇది తెలుసుకోవాలంటే కేవలం ఏడు సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఓటరు వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ ప్యాట్) ద్వారా కల్పిస్తోంది. ఏడు సేకన్లలోపు వేసిన ఓటును వీవీ ప్యాట్ ద్వారా చూసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం ఆ ఓటు వీవీప్యాట్ బాక్స్‌లో పడిపోతుంది. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. దీంతో వీవీ ప్యాట్ విధానాన్ని దశల వారీగా దేశమంతటా అమల్లోకి ఎన్నికల సంఘం తీసుకు వచ్చింది.
గతంలో కొందరు బ్యాలెట్ పేపర్ పై ఓటు వేసేవారు. తర్వాత ఆ విధానం రద్దు చేసింది. ఇదే తరహాలో వేసిన ఓటును సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, బహిర్గతం చేయడం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం చెబుతోంది.