Mon Dec 15 2025 06:39:23 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు కామారెడ్డికి రేవంత్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. అనేక కార్నర్ మీటింగ్లలో రేవంత్ పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కామారెడ్డి నియోజకవర్గంలోని చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూర్ లలో జరిగే సమావేశాల్లో రేవంత్ పాల్గొననున్నారు.
హామీలు ఇస్తూ...
కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే తరచూ కామారెడ్డిలో పర్యటిస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా విడుదల చేసిన మ్యానిఫేస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

