Mon Dec 15 2025 06:38:16 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు రెండు జిల్లాలకు రేవంత్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఒక్కొక్కరుగా విడిపోయి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెబుతూ, పదేళ్ల కేసీఆర్ పాలనపై విరుచుకుపడుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో...
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మహిళ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ లు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని అక్కడి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి సభలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. జనసమీకరణ చేయనున్నారు.
Next Story

