Thu Nov 14 2024 22:54:38 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : బీఆర్ఎస్ టైం అయిపోయింది... బీజేపీ సమయం వచ్చింది
ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని హోం మంత్రి అమిత్ షా అన్నారు. గద్వాల్ బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు.
ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. గద్వాల బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ టైం అయిపోయిందని, బీజేపీ వచ్చే సమయం ఆసన్నమయిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని అమిత్ షా అన్నారు. అబద్ధపు మాటలతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. బీజేపీకి ఓటేస్తే సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా అన్నారు. అందుకు ప్రజలు కూడా మద్దతు పలకాలని కోరారు.
బీసీలకు అండగా...
వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని అమిత్ షా తెలిపారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తాము న్యాయం చేస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే వేగంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. యాభై మూడు శాతం బీసీలు బీజేపీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలంటే బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమని అమిత్ షా అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒవైసీకి లొంగిపోయాడన్నారు.
ఉద్యోగాల భర్తీ...
పెండింగ్ ప్రాజెక్టులను కూడా కేసీఆర్ పూర్తి చేయలేదని అమిత్ షా విమర్శించారు. మోదీ మంత్రివర్గంలో ఓబీసీ మంత్రులు ఎక్కువగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కన్నా ఈసారి బీసీలకు బీజేపీ అధికంగా సీట్లను ఈ ఎన్నికల్లో ఇచ్చిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు వ్యతిరేకమన్న అమిత్ షా టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ చేసి యువత వెన్ను విరిచారన్నారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయలేదని తెలిపారు. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఐదేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ కాళేశ్వరంలో, మిషన్ భగరీధలోనూ పెద్ద యెత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు.
Next Story