Thu Dec 19 2024 17:01:21 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : కేసీఆర్ టైం అయిపోయింది
కేసీఆర్ అవినీతి కారణంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వారి కుటుంబానికి వెళ్లిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు
కేసీఆర్ అవినీతి కారణంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వారి కుటుంబానికి వెళ్లిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పదేళ్లలో తెలంగాణ కోసం ఏ పనిచేయలేదన్నారు. అవినీతి మాత్రం పెద్దయెత్తున చేసి తన కుటుంబ ఆస్తులను పెంచుకున్నారని ఆయన ఆరోపించారు. శేరిలింగంపల్లి రోడ్ షోలో అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడినా సామాన్యులకు ప్రయోజనం చేకూరలేదని, కల్వకుంట్ల కుటుంబమే లబ్ది పొందిందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఏ వర్గానికి కేసీఆర్ న్యాయం చేయలేదని ఆయన అన్నారు.
డబ్బులిచ్చిన వారికే మంత్రి పదవులు....
ప్రశ్నాపత్రాలు లీకేజీ చేసి నిరుద్యోగుల ఆశలకు గండి కొట్టారని అమిత్ షా అన్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ టైం అయిపోయిందని అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ ఖచ్చితంగా అవినీతి పరులను జైలుకు పంపిస్తుందన్నారు. కేసీఆర్ అవినీతిపైన కూడా విచారణ జరిపి జైలుకు పంపడం ఖాయమని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రానికి ప్రయోజనమని అమిత్ షా అన్నారు. కారు స్టీరింగ్ కారు చేతిలో ఉందని, ఒవైసీ, రజాకార్లకు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా జరపడం లేదని అమిత్ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు.
Next Story